సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : దామెర మండల కేంద్రంలో మండల నూతన కమిటీ నియామకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పరకాల నియోజకవర్గ ఇన్చార్జి అమ్మ సాంబయ్య గారి ఆధ్వర్యంలో జరగగా జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు, జోనల్ మహిళా కన్వీనర్ అడ్లూరి పద్మ గారు హాజరైనారు. మండల అధ్యక్షులుగా ముత్యాల నరేందర్ ఉపాధ్యక్షులుగా పరికిరాల రాజు ప్రధాన కార్యదర్శిగా గోవిందు రాజు లను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో నిర్మాణం చేసి పరకాల నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా నియామకమైన ముత్యాల నరేందర్ మాట్లాడుతూ దామెర మండలంలో బూత్ బూత్ కి కమిటీలను నియమించి గ్రామ గ్రామాన జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలంగాణలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేయడంలో దామెర మండలం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ముత్యాల నరేందర్ తెలియజేశారు.
-----------------------
Admin