సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామానికి విచ్చేసి తన తండ్రి గారైన శానంపూడి అంకిరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఎస్సీ అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, ఆ మహనీయుడు దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ అంబేద్కర్ పేద ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆదర్శవంతంగా నిలవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి , గుండా బ్రహ్మారెడ్డి , మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ , హుజూర్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి , చింతలపాలెం జడ్పిటిసి చింతారెడ్డి సైదిరెడ్డి , గుండ్లపల్లి సర్పంచ్ సుదర్శన్ , రఘునాధపాలెం మసీద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్ , ఎస్సీ అంబేద్కర్ యూత్ సభ్యులు మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin