Wednesday, 29 July 2026 03:58:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలి... -రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

Date : 06 November 2022 11:05 AM Views : 636

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణలోని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ఇప్పటికే ముగిసింది. ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నంలోగానే ఫలితం వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. ఏ కారణాలతో మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాల్సి ఉందన్న విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మురళి శనివారం సాయంత్రం పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ రూ.4 వేలు, టీఆర్ఎస్ రూ.5 వేల చొప్పున ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన రుజువులు సోషల్ మీడియాలో చాలా వచ్చాయని తన పోస్ట్ లో మురళి తెలిపారు. ఈ కారణంగా ఎన్నికల ఓట్ల లెక్కంపును తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పనులను టీఆర్ఎస్, బీజేపీలు ఇకనైనా ఆపాలని ఆయన కోరారు. మురళి వాదనపై నెటిజన్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఎన్నికలను రద్దు చేస్తే... మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే కదా... మరి అప్పుడు ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా? అని కొందరు ప్రశ్నిస్తే... మురళి లేవనెత్తిన అంశం కీలకమైనదని, దీని ఆధారంగా ఎన్నికలను రద్దు చేయాలని మరికొందరు వాదిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :