సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలంలో ని వంగ ముత్యాల బంజరు గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు సంక్రాంతి వీరయ్య తులసి చెట్టు వద్ద ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ మహాలయ అమావాస్య నుండి తొమ్మిది రోజులు పాటు ఊరు వాడల పూలు వనాలగా మారి పులకరించే పండగ బతుకమ్మ అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మహాలయ అమావాస్య సందర్భంగా పెనుబల్లి మండలం, విఎం బంజరు గ్రామంలో ఏర్పాటుచేసిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఈ సందర్భంగా మహిళా మణులు తులసి చెట్టు నాటి బతుకమ్మ పండుగను ప్రారంభించుకోగా, గౌరీ దేవిగా భావించే తులసి చెట్టును ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పూజ లు నిర్వహించారు. అనంతరం మహిళా మణులు పూలతో పేర్చిన బతుకమ్మలను చెట్టు చుట్టూ పరచి ఆటపాటల తో బతుకమ్మను వేడుకలను నిర్మించారు
-----------------------
Admin