సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా రంగంలో కొనసాగుతున్న వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని,అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల ఆత్మగౌరవ భవన్ లు నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టీఎస్ జే ఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలన్నీ ఇంతకాలం నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా నడుస్తూ ఎలాంటి వేతనాలు లేకుండా ఇదే వృత్తిని నమ్ముకొని ఎంతో కాలంగా కొనసాగుతున్న జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నూటికి 80% ప్రాంతాలలో సొంత ప్రెస్ క్లబ్లు లేక జర్నలిస్టులు టీ హోటల్లో చెట్ల కింద ప్రైవేటు భవనాల కింద కాలం గడపాల్సిన దుస్థితి దాపురించిందని గుర్తు చేశారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ప్రెస్ క్లబ్బులు నిర్మించాలని కోరారు.అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇంకా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాల కు ఆర్థిక సహాయం పెంచాలఅన్నారు. జర్నలిస్టుగా కొనసాగుతున్న వారికి పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీస్ భరోసా కార్డులు ప్రత్యేకంగా ఇవ్వాలని యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు.రాబోయే ఎన్నికలలోపే ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లను కలుపుకొని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని తాము ఉద్యమాలు చేపడతామని చెప్పారు.అనంతరం అసోసియేషన్ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర గౌరవ సలహాదారులు మానుకొండ రాము రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘువరన్ ఆచార్యులు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గట్టిగుండ్ల రాము ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి జిల్లా గౌరవ అధ్యక్షుడు బరిగల విజయకుమార్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరాజు సూర్యాపేట పట్టణ కోశాధికారి తిరుపతి శ్రీనివాస్ సూర్యాపేట మండలం ప్రధాన కార్యదర్శి కాటం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin