Saturday, 18 April 2026 04:31:02 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఇది లేడీ కాదు..! కిలాడి..?

Date : 02 December 2025 12:33 PM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / కాకినాడ జిల్లా : కాకినాడ జిల్లావ్యాప్తంగా జరిగిన ఆరు చోరీ కేసుల్లో సుమారు 60లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది నిందితులను అరెస్టు చేశారు. అన్నవరంలో ఓ ఇంట్లో చోరీ కేసుకు సంబంధించి విశాఖ జిల్లా భీమిలి మండలం చేపల ఉప్పాడకి చెందిన సీహెచ్ ఎల్లాజీని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 172 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. నిందితుడిపై 20 బైక్ దొంగతనాలతోపాటు.. ఇతర కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రత్తిపాడు గోల్డ్ షాప్ చోరీ కేసులోనూ 9 మంది నిందితులను అరెస్టు చేసి.. 11 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉండడంతో వేట కొనసాగిస్తున్నారు... జగ్గంపేట, తుని, విజయవాడ పరిధిలో జరిగిన 4 వేర్వేరు బ్యాగ్ చోరీల కేసుల్లో 176 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో ఇద్దరు అంతర్ జిల్లా మహిళా దొంగల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిగూడెం, యాగరిపల్లి కాల్వగట్టుకి చెందిన గేరక వరలక్ష్మి, మరసాని సత్యవేణి అనే ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేశారు. వీళ్లిద్దరిపైనా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయా కేసుల్లో నెల్లూరుకు చెందిన షేక్ ఫక్రుద్దీన్ బిషనైని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మధ్యప్రదేశ్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు ఉన్నారు. ప్రధాన నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే.. తాడేపల్లిగూడెం మండలంలో సాయిచంద్రారెడ్డి ఇంటి నుంచి 11 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు చోరీ కేసులకే సంబంధించి ఇప్పటికే 12 మందిని అరెస్ట్‌ చేసిన కాకినాడ పోలీసులు.. మరో నలుగురు కోసం గాలిస్తున్నారు. వీరిలో ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు.. మరో ఇద్దరు నెల్లూరుకు చెందినవారు ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు ఎస్పీ బిందుమాధవ్..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :