సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గ్రామాలలో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలో జరిగిందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గ్రామాలలో శాశ్వతంగా గుర్తుండేలా జరిగిన అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పనితీరు అమోఘం అనీ కొనియాడారు.దేశంలో ఏ అవార్డు ప్రకటించిన తెలంగాణకు వరించిన అవార్డులే దీనికి నిదర్శనం అన్నారు. ఎన్ని అవార్డులు ప్రకటించినా మొత్తానికి మొత్తం తెలంగాణనే ఆక్రమిస్తుండడంతో దేశాన్ని జోన్లుగా విభజించేలా కేంద్ర ప్రభుత్వం పాలసీనే మార్పు చేసే విధంగా స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ గ్రామాలకు ఇక్కడి పట్టణాలే పోటీ అన్నారు. పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు.పచ్చదనాన్ని పెంపొందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఎనలేనిదన్న ఆయన ప్రభుత్వం ఉద్యమంలా కొనసాగించిన హరితహారం కారణంగా మూడు శాతం ఉన్న అడవులు ఏడు శాతానికి పెరిగాయి అన్నారు. దీనిలో స్థానిక నాయకత్వాన్నిదే ప్రధాన భూమిక అన్నారు. సేవ చేసే వారిని ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న జగదీష్ రెడ్డి, ప్రజల ఆశీస్సులతో మరోసారి ప్రజాప్రతినిధులుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం మరో రెండు రోజుల్లో పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లను జగదీష్ రెడ్డి సన్మానించారు. ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి , జడ్పిటిసి సంజీవ నాయక్,వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సుధీర్ రావు,ఎంపీడీవో లక్ష్మి, ఎంపీఓ గోపి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొన్నారు...
-----------------------
Admin