Thursday, 30 July 2026 04:28:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సమీకృత వాణిజ్య భవనం ఎక్కడ సూటి ప్రశ్న...? -బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జ్ రాపోలు నవీన్

Date : 07 July 2023 02:13 AM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్లలో అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపి పట్ల బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి రాపోలు నవీను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.నేరేడుచర్లలోని జాన్ పహడ్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ సముదాయాన్ని సందర్శించి, పునాదులలో బీఎస్పీ బృందంతో కూర్చొని నిరసన తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీకృత వాణిజ్య భవన నిర్మాణం ఆగిపోతానికి కోర్టు కారణమని అబద్ధాలు చెబుతున్నారని, కోర్టుకు వేయించింది ఎవరో,,, నిర్మాణం ఆగిపోతానికి పరోక్ష కారణం ఎవరో,,, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఎస్పి స్థలానికి సంబంధించిన పత్రాలు బలవంతంగా లాక్కెళ్ళింది ఎవరో... ప్రజలందరికీ తెలుసని, తమను ఎవరు గమనించడం లేదని కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి చందoగా ప్రవర్తిస్తున్న వారికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని... మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేసిన దానికే దిక్కు మొక్కు లేకుండా పోయిందని,, ఒక కోటి 90 లక్షల రూపాయలు విధులు మంజూరు చేసి, ఏమీ తెలియనట్టుగా స్థలం యొక్క మాజీ యజమానిని రెచ్చగొట్టి కోర్టుకు వేయించి చోద్యం చూస్తున్నారని, నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కోట్లకు కోట్లు మంజూరు చేస్తున్నట్టు పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నారే కానీ, అభివృద్ధి ఎక్కడో చూపించాలని ఆయన కోరారు, మారుమూల గ్రామాలకు స్మశాన వాటికలు నిర్మిస్తే.. మునిసిపాలిటీగా రూపాంతరం చెందిన నేరేడుచర్ల స్మశాన వాటికను ఒకసారి సందర్శిస్తానికి రావాలని ఆయన స్థానిక బిఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, సమీకృత మార్కెట్ ను,స్మశాన వాటికను మరియు బైపాస్ రోడ్డు నిర్మాణాన్నిచేపట్టాలని, ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికి తాగు నీరు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి బొల్లాగాని సుబ్బు గౌడ్, ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి, పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పతల నవీన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: