Wednesday, 29 July 2026 06:41:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది యువతను కోల్పోతున్నాం సన్ ప్రీత్ సింగ్

Date : 21 January 2026 10:54 PM Views : 432

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నిర్లక్ష్యంగా కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో భవిష్యత్తు వున్న యువతను కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరైవ్ / ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో భీమారంలోని స్కిల్ స్టోక్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు వర్ధన్నపేట శాసనసభ్యుడు కె.ఆర్. నాగరాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీపీ వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశంలో జరిగే హత్యలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య అధికమని.గత ఏడాది తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, వాహనదారుడు నిర్లక్ష్యంగా వాహనం నడపడం ద్వారా తనతో పాటు ఇతరులలు కూడా మృత్యువాత పడుతున్నారని. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికమని. ఈ ప్రమాదాల తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు క్రమశిక్షణతో వాహనం నడపాలని, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ ను అనుసరిస్తూ వాహనం నడపడం ద్వారా, తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకుంటారని.ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వాహనం ఎవరు నడిపిన, చివరికి పోలీసులైన చర్యలు తప్పవని, ప్రతి వాహనదారుడు తన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నిర్లక్ష్యంగా వాహనం నడపోద్దని,అదేవిధంగా మీడియా ప్రతినిధులు సైతం తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అలాగే ద్విచక్ర వాహనం పై వెళ్ళే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాల్సి ఉంటుందని.జీవితం చాలా విలువైందని, పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు. వర్ధన్నపేట శాసనసభ సభ్యులు కె. ఆర్ నాగరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలను చేపట్టడం జరుగుతొందని, ఇందులో భాగంగానే రహదారి ప్రమాదాల నివారణకై ఆరైవ్, ఆలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడబడుతోందని. ముఖ్యంగా తమ తల్లిదండ్రులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా పిల్లలు తల్లిదండ్రులకు కోరాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం మత్తుపదార్థాలపై కూడా కఠినంగా అనచివేత ధోరణి ప్రదర్శిస్తుందని, దయచేసి యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని శాసనసభ్యులు తెలియజేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో రూపొందించిన ఆరైవ్-ఆలైవ్ ప్రచార పోస్టర్లను అధికారులు ఆవిష్కరించి, రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తామంటూ విద్యార్థులతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్ స్పీక్టర్లు సీతారెడ్డి, సుజాత, వెంకన్న, శ్రీనివాస్, కేయుసి ఇన్స్ స్పెక్టర్ రవి కుమార్,స్కిల్ స్టోక్ పాఠశాల డైరెక్టర్ అనుప్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: