Tuesday, 15 September 2026 08:46:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గురునానాక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి... -ఏ ఐ ఎస్ఎఫ్

Date : 25 June 2023 01:20 AM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) అధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలియ చేశారు.ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శివకుమార్, గ్యార క్రాంతి మాట్లాడుతూ గురునానాక్ యూనివర్సిటీకి అనుమతి లేకుండా అడ్మిషన్లను స్వీకరించిన కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. 3800 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం తో పాటు ఫీజుల రూపంలో సుమారు 180 కోట్ల రూపాయలను వసూలు చేశారని అన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళసై వెంటనే జోక్యం చేసుకొని విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలో పునరావృత్తం కాకుండా అన్ని యూనివర్సిటీలపై పర్యవేక్షణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వలన గురునానక్ కాలేజ్ యాజమాన్యం ఈ దుశ్చర్యలకు పాల్పడిందని వారు అన్నారు.. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వారి ఆందోళనలకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులపై లాటి చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.నాయకుల పై ,తల్లిదండ్రులపై విద్యార్థుల పైన అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలి వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు సూర్యం, అఖిల్, గణేష్, విజేందర్, సిపిఐ నాయకులు రాజు,గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :