సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సామాజికన్యాయం అమలుకు 28 ఏళ్ల వయస్సులోనే తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి,సమాన అవకాశాలకు పునాదులు వేసిన మహనీయులు ఛత్రపతి సాహుమహరాజ్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ సాహు మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహు మహరాజ్ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యాసంస్కరణల కమిటీ ఏర్పాటు చేసి,1917లోనే ఉచిత నిర్భంధ విద్య అమలు చేశారని గుర్తుచేశారు.అంతేకాకుండా తన రాజ్యంలో కులాంతర,మతాంతర వివాహాల చట్టం తీసుకువచ్చి ప్రజాస్వామ్య విలువలకు పునాదులు వేశారని,హిందూ పిల్లల జోగిని వ్యవస్థను నిరోధించే చట్టం తెచ్చి,వివక్ష అంటరానితనం నిషేధించి కొల్హాపూర్ సంస్థానాన్ని ఎన్నో మిగతా రాజ్యాలకంటే అధునాతన,ఆధునిక భావాలతో అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు.అదేవిధంగా అంటరానికులాలకు చెందిన ప్రజలకు చదువు రాకపోయినా,సైన్యంలో చేరే అవకాశాలను కల్పించి సమానత్వాన్ని చాటి చెప్పారని,అందుకే బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం ఈ మహనీయున్ని పార్టీ సిద్దాంతకర్తగా పేర్కొన్నారని తెలిపారు.ఛత్రపతి సాహు మహరాజ్ స్పూర్తితో బీసీలకు చట్ట సభల్లో 60 నుండి 70 సీట్ల వరకు ప్రాతినిధ్యం కల్పించబోయే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమే అన్నారు.బహుజన్ సమాజ్ పార్టీ పాలనలోనే ఛత్రపతి సాహు మహరాజ్ ఆశయాలను నెరవేరుస్తూ,భారతరాజ్యాంగ విలువలు కాపాడబడుతాయన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శులు చెనిగారపు నిరంజన్ కుమార్,మాలోత్ వీరు నాయక్,మాలోత్ పూర్ణ చందర్,వంగా రవిశంకర్,సందేల సందీప్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin