సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణానికి కొత్తగా వచ్చిన డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మరియు 1 టౌన్ సిఐ సత్యనారాయణ ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివారు ప్రాంతల నుండి విపరీతంగా గంజాయి రవాణా సాగుతున్న నేపథ్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో వాహనాల తనిఖి నిర్వహించడం జరిగింది. నెంబర్ ప్లేట్లు లేని బైక్ లను పట్టుకొని స్టేషన్ కి తరలించారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో నెంబర్ ప్లేట్ లేని బైకులు ఎక్కువగా ఉండడం వల్ల భారీగా బైకులను స్టేషన్ కి తరలించారు. వాటిలో దొంగ వాహనాలు ఏవో తెలియాల్సి ఉంది. పట్టణంలో క్రైమ్ అరికట్టే దిశగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు....
-----------------------
Admin