సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ముంబాయి కి చెందిన రంగోత్సవం సెలబ్రేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో ముమ్మర ప్రపంచం వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో నిర్వహించిన వివిధ ఆర్ట్ విభాగాల్లో హుజుర్‌నగర్ గురుకుల విద్యార్థులకు పలు అంతర్జాతీయ స్థాయి లో అవార్డులు సాధించినట్లు తెలంగాణా సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్. రాధాకృష్ణమూర్తి, ఎస్ నందనాయక్ వైస్ ప్రిన్సిపాల్ , డాక్టర్ నాగజాను సూరేపల్లి ఆర్ట్ టీచర్ ఓ ప్రకటనలో తెలిపారు . రంగోత్సవం సెలబ్రేషన్స్ సంస్థ వివిధ విభాగాలలో 21 స్టూడెంట్స్ కి మందికి 21 అంతర్జాతీయ అవార్డులు స్కూల్ విద్యార్ధులకు లభించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు . ప్రిన్సిపల్ రాధాకృష్ణమూర్తి కి వరల్డ్ వైడ్ హైయెస్ట్ పెర్మమేన్స్ అవార్డు అలాగే ఆర్ట్ టీచర్ కి డాక్టర్ నాగజాను సూరేపల్లి కి వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ సెల్వడోర్ డాలి అవార్డు లభించింది. ఎక్కువ అవార్డులు లభించటంతో విద్యార్డులతో పాటు స్కూల్ కి ఆర్ట్ విభాగంలో కూడా అంతర్జాతీయ గ్లోబల్ స్కూల్ అవార్డు లభించినట్లు వారు తెలిపారు . పోటీలలో పాల్గొన్న చెడపంగు సాయినవీన్ 7వ తరగతి కోలాజ్ ప్రజెంటేషన్ కు అంతర్జాతీయ స్థాయిలో మూడోవ ప్రైజెస్, కలరింగ్ లో మంచాల నిఖిలేంద్ర కు 10 వ తరగతి విద్యార్ధి అంతర్జాతీయ మెరిట్ అవార్డు,జానపటి అఖిల్ 6 వ తరగతి కలరింగ్ లో అంతర్జాతీయ మెరిట్ అవార్డు, 12 అంతర్జాతీయ మెడల్స్ లభించింది . 6 అంతర్జాతీయ కన్సలేషన్ ప్రైజెస్ పొందిన్నారు అంతర్జాతీయ రంగోత్సవ సెలెబ్రేషన్స్లో, వివిధ విభాగంలో కలరింగ్,టాటూ మేకింగ్, స్కెచ్, గ్రీటింగ్ కార్డ్ మేకింగ్, కొలాజ్, ఫోటోగ్రఫీ, కార్టూన్ మేకింగ్, హ్యాండ్ రైటింగ్,అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయని ప్రిన్సిపల్ ,ఆర్ట్ టీచర్ తెలిపారు. అవార్డు లు సాధించిన విద్యార్ధులకు టీచర్స్ బృందం ప్రత్యేకంగా అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఆర్ట్ టీచర్, టీచర్స్,యస్ నందనాయక్, విజయలక్ష్మి, డాక్టర్ నాగజాను సూరేపల్లి, రాంబాబు,చిరంజీవి,రమేష్, సురేందర్ రెడ్డి, యాస్మిన్, ప్రమీల, రాణి, భగీరధి,శ్రీనివాస్,సైదులు, నాగేశ్వరావు, రాజేష్, వినోద్, సైదులు, అశోక్,మధు, విజయ్,కిరణ్ కుమార్,సాలమ్మా, అనసూర్య, ఇస్తారీ, నాగరాజు,సుధాకర్,స్కూల్ టీచింగ్ మరియు నాన్ స్టాఫ్ మరియు పేరెంట్స్ అభినందనలు తెలిపారు...
-----------------------
Admin