Thursday, 30 July 2026 05:53:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ప్రారంభం...

Date : 04 October 2023 07:42 AM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించిందని ఇందులో భాగంగా ప్రజల కష్టాలను తీర్చేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని.. ఎన్ని కష్టాలైనా అనుభవిస్తానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. షాద్ నగర్ నియోజక వర్గం ఫరూఖ్ నగర్ మండలం నాగర్ల గడ్డ తాండలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ తన సొంత ఖర్చులతో సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలతో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని రెండు పర్యాయాలు వాళ్లు నియోజకవర్గాన్ని పాలించారని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ఆవిష్కృతం చేశామని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని దీనికి ప్రజల ఆశీస్సులు సంపూర్ణంగా కావాలని అన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలు అమలు ఐతే రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉండటారని అన్నారు. మహిళలకు చిన్న కష్టం కూడా రానివ్వమని అన్నారు. రైతులకు యువతకు విద్యార్థులకు అన్ని వర్గాలకు పెద్దపీట వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, ఎస్టీ సెల్ తాలూకా అధ్యక్షుడు శీను నాయక్, కంసాన్ పల్లి మాజీ ఎంపీటీసీ తుపాకుల శేఖర్ ముదిరాజ్, రవి నాయక్, కే సత్తిరెడ్డి, ఎం డి వహాబ్, ఏ బాలరాజు, ఎండి మున్నా, విలేజ్ ప్రెసిడెంట్ మల్లేష్, జగన్ నాయక్, లడ్డు, తండా మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :