Sunday, 13 September 2026 10:34:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమరవీరుల త్యాగఫలం తెలంగాణ...

Date : 23 June 2023 12:00 AM Views : 550

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరుగని పోరాటం.. అమరవీరుల త్యాగఫలం.. అన్ని వర్గాల ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ సాధనలో అత్యంత కీలకమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని పురపాలికలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మున్సిపల్ శాఖ సమావేశ మందిరంలో చైర్మన్ కె నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ వెంట ఉద్యమంలో ముందుకు నడిచి తెలంగాణ సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాధించుకోవడం వల్లనే గత తొమ్మిదేళ్ల కాలంలో పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, రైతుబంధు, రైతు భీమా వంటి కార్యక్రమాలు, ఉచిత విద్యుత్తు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారులు, సొంత భవనాలు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు వంటివి గతంలో ఎన్నడూ లేవన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు తెలంగాణకు ముందు, తెలంగాణ తర్వాత జరిగిన అభివృద్ధిని ఒకసారి పరిశీలించి మాట్లాడాలని హితువు చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాలని కోరారు. శతాబ్ది ఉత్సవాలు చేసుకోవడం తప్పా..? ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం, తెలంగాణ, ఉద్యమ కారులను స్మరించుకోవడం తప్పా అని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేసిన ప్రగతి, చేయబోయే కార్యచరణ భవిష్యత్తు గురించి ప్రజల్లో ప్రచారం చేయడం తప్పు అనే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రజలకు సంక్షేమం చేసి వాటి ప్రతిఫలాలు అందజేసిన తీరుపై అదేదో తప్పైనట్టు మాట్లాడుతుండడం వారి అజ్ఞానానికి నిదర్శనం అని ఎమ్మెల్యే హితబోధ చేశారు. ప్రజలకు చేసిన అభివృద్ధి గురించి చెప్పడం ప్రభుత్వ కర్తవ్యం అని ఈ సందర్భంగా అన్నారు. పురపాలక చైర్మన్ కె .నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాకే షాద్ నగర్ పురపాలికలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అన్నారు. ప్రధాన రహదారి విస్తరణ, పాత జాతీయ రహదారి విస్తరణ, పురపాలిక గ్రంథాలయాలకు సొంత భవనాలు, కాలనీల వారిగా రహదారులు అంతర్గత కాలువలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పురపాలిక కమిషనర్ వెంకన్న, పురపాలక వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, అన్ని వార్డుల కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: