సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా గ్రామ సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయదలచడమైనది. ఈ గ్రామ రక్షణ కమిటీలో యొక్క ముఖ్య ఉద్దేశము రాత్రి సమయంలో ఆ ఊరి నందు గస్తీ తిరుగుతూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఆ గ్రామంలో సంచరించిన అనుమానస్పదంగా వాహనాలు వచ్చినా వారి యొక్క సమాచారం తక్షణమే పోలీసు వారికి తెలియజేయడం. [గ్రామ సంరక్షణ కమిటీ యొక్క రూపము] ఎక్కువ జనాభా కలిగిన గ్రామంలో అయితే దానియందు ఐదు నుండి పదిమంది గ్రామ రక్షణ కమిటీ సభ్యులు ఉంటారు అదేవిధంగా తక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామం అయితే రెండు నుంచి ఐదు మంది గ్రామ రక్షణ కమిటీ సభ్యులు ఉంటారు. అంకితభావంతో సేవాభావం కలిగిన యువత గ్రామ సంరక్షణ కమిటీ సభ్యులుగా ఉండదలుచుకుంటే ఓబుల దేవర చెరువు పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గోపి సంప్రదించగలరు. ఏమీ ఆశించకుండా కేవలం సేవ చేయాలన్న మంచి సంకల్పం ఉన్నవారు ఆహ్వానితులు.
-----------------------
Admin