Monday, 14 September 2026 07:27:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ అసెంబ్లీ టికెట్ కోసం వీర్లపల్లి శంకర్ దరఖాస్తు...

Date : 26 August 2023 09:21 AM Views : 329

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నా బలం కాంగ్రెస్ కార్యకర్తలు.. నా బలగం షాద్ నగర్ నియోజక వర్గం ప్రజలు. వారిని నమ్ముకుని నేను రాజకీయం చేస్తున్నాను. అధికార పార్టీ నుండి ఎన్నో కష్టనష్టాలు, సవాళ్లు ఎదురైనా వాటన్నింటిని ఎదుర్కొని ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా నా వంతు కృషిగా విజయవంతం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దగ్గరగా చేశాను. అధిష్టానం నా సేవలకు మెచ్చి నాకు టీపిసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కుడా ఇచ్చారు. ఇప్పుడు షాద్ నగర్ అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్నాను. కచ్చితంగా టికెట్ నా కష్టానికి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను అంటూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో షాద్ నగర్ నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గాంధీ భవన్ లో షాద్ నగర్ నియోజకవర్గంకు చెందిన పలువురు నాయకులతో, కార్యకర్తలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం పై తనకు నమ్మకం ఉందని నియోజకవర్గానికి పార్టీ టికెట్ తనకు కేటాయిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం పార్టీ కోసం ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేశానని నియోజకవర్గంలో 6 మండలాల్లో పార్టీని అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. ఒకప్పుడు నిరాశ నిస్సృహల మధ్య ఉన్న కాంగ్రెస్ పార్టీని డోలాయమాన పరిస్థితి నుండి బయటకు తెచ్చి నేడు పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేశానని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నమ్మకం వ్యక్తం చేశారు. సర్వేలు కూడా తనకు అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే తన గెలుపుకు కారణం అవుతాయని వీర్లపల్లి శంకర్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు అధిష్టానం ఇచ్చిన పిలుపుకు తరలివెళ్లిన అనేక కార్యక్రమాల వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు మరియు ఆరు మండలాల అధ్యక్షులు ఆరు మండలాల మహిళా అధ్యక్షురాలు మరియు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ మహిళా కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ బీసీ సెల్ ఎస్టీసెల్ మరియు సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ బిండో డైరెక్టర్లు మాజీ సర్పంచులు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమర్పించడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: