సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : భూమి కోసం, భూక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్బంగా సిపిఎం ఉప్పరపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది, ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పరికి మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట విల్లంబై, అలుపెరుగని ఆయుధమై, కదిలిన ధీరవనిత ఐలమ్మ అని అన్నారు, దొర గాడి గుండెలపై సింహ స్వప్నమై, గర్జించిన విప్లవ మూర్తి. మహిళా చైతన్య స్ఫూర్తి. నిరంతరం మార్పు కోసం పని చేసి తెలంగాణ ప్రజలకు ఆదర్శమైన వ్యక్తి. ఒక ఉన్నతమైన ఆశయాల కోసం ఉద్యమిస్తున్నా ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన వారు ఐలమ్మ. గారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాం ... ఉద్యమ చరిత్రలో ఉమ్మడి వరంగల్ జిల్లా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అట్లాంటి గడ్డపై పుట్టిన తాను భూస్వామ్య ఆగడాలను చిన్నతనము నుండి చూస్తున్నా అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడానికి పోరు సైరనై, కదిలింది. నైజాం సర్కార్ సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా, పీడిత, తాడిత జనాలకు తోడుగా వెట్టిచాకిరి బానిసత్వానికి గురవుతున్న ప్రజలను చైతన్య పరచడం కోసం ఉద్యమ బాట గా సాగారు. తెలంగాణ ప్రాంతమంతా నైజాం ఏలుబడి లో ఉండి దొరలు, భూస్వాములు, జాగీర్దారులు మాల్ పటేల్ పట్వారీ వ్యవస్థను ధ్వంసం చేయడానికి, కార్మిక, కర్షక పోరాటాలకు పురుడు పోస్తున్న కాలంలో, రైతులంతా సంఘటితమై ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వం అండతో కదులుతున్న సందర్భంలో, దొర అహంకారానికి, అరాచకాలను అడ్డుకొని విముక్తి కలిగించాలని సాయుధ పోరాటానికి నడుము కట్టి, తుపాకి చేతబట్టి నడిచిన వీరనారి. సాయుధ పోరాట చరిత్రలో వారి ప్రస్థానం చిరస్మరణీయం. ఆంధ్రమహాసభలో భాగస్వామ్యామై, కదిలిన ధీరవనిత. మహిళా హక్కుల కోసం ఉద్యమాలు సాగించింది. ప్రజలందరి బాగు కోరే వ్యవస్థ రావాలని చివరి శ్వాస వరకు పోరాడి నిలిచి గెలిచింది. వారి జీవితమంతా చరిత్ర చెరిపేసిన చెరగని ముద్ర గా నిలిచిపోతుంది. ఈ నేలపై ఉద్యమిస్తున్న వారికి ఆదర్శప్రాయురాలు అవుతుంది. ఉన్నతమైన విలువల కోసం పని చేసే నేటి తరానికి, భవిష్యత్ తరాలకు నిత్య స్ఫూర్తి దాయకంగా నిలిచిన విప్లవ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు , ఈ కార్యక్రమం లో సిపిఎం నెక్కొండ ఏరియా కమిటీ సభ్యులు ఏనుగుతల నరేష్, కుక్కల రాజు, బోయిని నాగరాజు,గుళ్ళపల్లి స్వామి, కుక్కల రాజు, పెరుమళ్ళ మల్లారెడ్డి, గుళ్ళపల్లి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin