సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మఠంపల్లి ప్రభుత్వ దవాఖానను మండల ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల హాస్పిటల్లో డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలు, వైరాలజీ ల ల్యాబ్, దవాఖానల రికార్డులను పరిశీలించి,సం తృప్తిని వ్యక్తపరిచారు. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ సూచించారు. డాక్టర్లు క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులు వస్తున్న కారణంగా ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఏపీవో ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin