సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం శుభసూచకమని కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ను భారి మెజార్టీతో గెలుపుకు కృషీ చేయాలనీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం ఆర్మూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్ నేత డాక్టర్ మల్లురవి సమక్షంలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసిలు, నాయకులు, తదితరులు పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఫరూఖ్ నగర్ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, కొత్తూరు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకుడు సుదర్శన్ గౌడ్, మైనార్టీ నేత జమృధ్ ఖాన్, క్రాంతి రెడ్డి, వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకురాలు రమాదేవి, మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ శ్రావణి, రంగపల్లి సర్పంచ్లు శ్రీనివాస్ యాదవ్, మాధురాపురం సర్పంచ్ శివారెడ్డి, లక్నాపురం రాజశేఖర్, వేముల నర్వ సర్పంచ్ మల్లేష్, ఇప్పలపల్లి ఎంపీటీసీ మంజుల రాజశేఖర్, తదితరులకు రాహుల్ గాంధీ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి రాహూల్ సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున చేరేందుకు తన వద్దకు వచ్చినందుకు నాయకులకు రాహుల్ గాంధీ శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీల ప్రోత్సాహంతో ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మారబోబోతుందని నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకురాబోతున్నామని శంకర్ వివరించారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు పేర్లను శంకర్ విడుదల చేశారు. వారందరికీ తను రుణపడి ఉంటానని శక్తి వచనం లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin