సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలో తరలిస్తున్న భారీ గంజాయి ప్యాకెట్లను టూ టౌన్ పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది విశాఖపట్నం నుంచి ఖమ్మం మీదుగా మహారాష్ట్రకు చెందిన ఓ లారీ లో భారీ గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నారని టూ టౌన్ పోలీసులకు సమాచారం వచ్చింది దీంతో టూటౌన్ సీఐ శ్రీధర్ ఇతర సిబ్బందితో కలిసి తన వాహనం లో బైపాస్ రోడ్డులోని టేకులపల్లి బ్రిడ్జి వద్ద నిఘా వేశారు లారీ వచ్చే సమయంలో వెంటనే ఆపారు తర్వాత తనిఖీ చేయగా దానిలో భారీ గంజాయి ఉన్నట్టు తెలిసింది సుమారు రెండు నుంచి మూడు కోట్లు విలువ చేసే గంజాయి పట్టుపడ్డట్టు ప్రచారం జరుగుతుంది దీంతో లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది...
-----------------------
Admin