సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని దూస్ కల్ గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవమును ఘనంగా నీర్వహించుకోవడం జరిగింది. పల్లె ప్రగతి దినోత్సవంలో ముందుగా జాతీయ పతకావిష్కరణ చేసి, గ్రామసభను నిర్వహించి పల్లెప్రగతి వల్ల గ్రామంలో సాధించిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా కరపత్రాలు ఇచ్చి పంచాయతీ కార్యదర్శి ఆరాధన కూలంకషంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత గ్రామ ఎంపిటిసి యాదయ్య పల్లె ప్రగతి ఫలాల్ని వివరించారు. గ్రామ సర్పంచ్ చౌలపల్లి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ నాడు-నేడు పల్లె ఏ విధంగా ఉండెనో చెప్పి, ఈ పదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని వివరించారు. ఆ తర్వాత విద్యార్థులతో మానవహారాన్ని ఏర్పాటు చేసి, గ్రామంలో ర్యాలీని నిర్వహించి సమీపంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను సందర్శించారు. ఇట్టి కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగేష్, గ్రామంలోని వార్డుమెంబర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్, రేవతి, ఉపాధ్యాయులు సర్ఫరాజ్, నీల్యాలు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, బుక్ కీపర్లు, కారోబార్ శ్రీశైలం, పారిశుధ్య కార్మికులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు పెద్దమొత్తంలో పాల్గొని జయప్రదం చేశారు.
-----------------------
Admin