సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో భారత దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రధానిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటేరియన్ గా భారత దేశానికి అనేక సేవలు అందించారని ఆయన అన్నారు అదిలాబాద్ జిల్లాతో ఆయనకు అవినావ భావ సంబంధం ఉందని జాతీయ రహదారి నిర్మాణం తో పాటు సజలధార పథకానికి బేల మండలం ఆవాల్పూర్ గ్రామంలోనే శ్రీకారం చుట్టారని ఆయన గుర్తు చేశారు అదిలాబాదులో ఒకరోజు బస కూడా చేశారని ఆయన అన్నారు వాజ్పేయి గారి ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లనే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి చేరిందని ఆయన అన్నారు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు వరుసలో చివరి వ్యక్తి వరకు చేరాలనేది ఆయన సంకల్పమని ఎమ్మెల్యే అన్నారు జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం. వేణు గోపాల్. చిలుకూరి జ్యోతి రెడ్డి . లాలమున్న భాజాపా నేతలు మయూర్ చంద్ర. ,జోగు రవి, ప్రవీణ్. భీమ్సేన్ రెడ్డి. రాకేష్. సోమ రవి.తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin