సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజక వర్గంలో నూతన అధ్యాయానికి బీజం పడిందని, కొత్త చరిత్ర సృష్టించేందుకు నాంది పలికిందని సింహభేరి సభ , ర్యాలీలను విజయవంతం చేసిన మహిళలకు, ప్రజలకు అభిమానులకు పాదాభివందనం అంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కనివిని ఎరుగని విధంగా తాను కూడా ఈ సింహభేరి జన సందోహాన్ని ఊహించలేదని, సుమారు 40,000 మంది ప్రజలు తన సభకు రావడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయవంతం చేసిన మహిళలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాఖీ కట్టి మహిళలు "అన్న" రుణం తీర్చుకున్నారని అన్నారు. నాలుగున్నర ఏళ్ల క్రితం సేవ అనే పంతాన్ని చేపట్టి రాజకీయాలకు అతీతంగా సేవయే పరమావధి అని భావించి 30 సేవా కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టినట్టు వివరించారు. నేడు ఆ సేవలే తనను రాజకీయాల వైపు నడిపించాయని తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు సేవ చేసి చరిత్ర సృష్టిస్తానని, మళ్లీ ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి సేవ చేయలేడు అనే విధంగా ప్రజలకు అండగా ఉంటానని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మన ప్రాంతాలకు వస్తే వచ్చే జనాభా కన్న అదనంగా తన సభకు ర్యాలీకి తరలిరావడం విశేషమని అన్నారు. తాను 20 నుండీ 25 వేల మందిని వస్తారని ఊహించానని కానీ పల్లెలు పల్లెలే తన సభ కోసం పెద్ద ఎత్తున తరలిరావడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళలు ఒక అన్నగా భావించి రాఖీ కట్టినందుకు అన్న రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అడుగుపెట్టిన ప్రతిచోట మహిళలు పూల వర్షం కురిపించారని, తన సోదరులు ఆప్యాయంగా తనను ఆదరించారని వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి త్వరలోనే 32 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఇటీవలే ఓ సర్వే చెప్పిందని ఆయన మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలాదిమంది స్వచ్ఛందంగా తన సభ కోసం తరలివచ్చినందుకు ఆయన మరోసారి మహిళలకు ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin