సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు చాలి చాలనీ సౌకర్యాలతో వారినీ నరకయాతనకు గురిచేస్తుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖదీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం షాద్ నగర్ పట్టణ పరిధిలో చటాన్ పల్లి వద్ద ఉన్న కేశంపేట దౌల్తాబాద్ బీసీ గురుకుల పాఠశాల దుస్థితిపై స్పందించారు. పాఠశాల భవనాన్ని తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. భవనం కిటికీలకు రెక్కలు లేకపోవడం చలికి కాపాడుకునేందుకు విద్యార్థులు కిటికీలకు దుప్పట్లు కప్పుకొని కాలం వెళ్లదీస్తున్న దయనీయ పరిస్థితులను చూసి జాలిపడ్డారు. పురుగుల అన్నం నాణ్యతలేని కూరగాయలు బియ్యం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. 800 మంది విద్యార్థులకు స్నానం గదులు మరుగుదొడ్లు సరిగ్గా లేవని ఈ దుస్థితి పగవారికి కూడా రాకూడదని ఖదీర్ అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఘోరమైన పరిస్థితిలో గురుకుల పాఠశాల నడుస్తుందని కేశంపేట దౌల్తాబాద్ విద్యార్థుల సౌకర్యాలు చూస్తే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. పరిస్థితి మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. నాణ్యతలేని భోజనాలు కనీసం ఉండడానికి మంచి సౌకర్యాలు లేని చదువులతో విద్యార్థులు ఎలా బాగుపడతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో.. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్ లక్ష్మణ్ టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముబారక్ అలీ ఖాన్, మండల్ అధ్యక్షుడు గణేష్ రాథోడ్, కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్, సాయి వంశీ, నాని, కాసిం, విశ్వనాథ, రాజేందర్, రాజు, విజయ్, భాస్కర్, సవల్ల వెంకటేష్, చిన్నయగరి నవీన్, నవీన్, బండి సాయి, బడికల రాజు అంకిత్ గంట్లవెల్లి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin