సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం ముందు భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీని భారత ప్రధాని నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ వ్యాఖ్యలు సరైంది కాదని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ధ్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు రెడ్డి మాట్లాడుతూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరుకు వస్తుంటే బిఆర్ఎస్ నేతలు ప్రధానంగా కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని. ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారని తెలవగానే కెసిఆర్ కు జ్వరం వచ్చి ఫామ్ హౌస్ లో పండుకున్నాడని. అది వైరల్ ఫీవర్ కాదని అది మోడీ ఫీవర్ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ చేసిన తప్పులు కారణంగా 1200 మంది యువకులు తమ ప్రాణాలను బలిదానం ఇవ్వడం అయిందని. ఇది కాంగ్రెస్ చేసిన తప్పుడు విధానాల కారణంగా జరిగినటువంటి సంఘటన అని ఎంతో బాధతో మోడీ గారు తెలంగాణ విషయంలో మాట్లాడుతుంటే కేటీఆర్ కు ఎందుకంత కడుపునొప్పి అర్థం కావడం లేదని కాంగ్రెస్తో పోటీపడి కాంగ్రెస్తో బి ఆర్ ఎస్ కుమ్మక్కై కేటీఆర్ మంత్రి భ్రమించి బిజెపిని విమర్శిస్తున్నారని. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబంలో అసహనం పెరిగిపోయి వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని. కేసీఆర్, కేటీఆర్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరి రాబోయే ఎన్నికలకు ఓట్లు అడగడానికి రావాలని. అర్వత లేకున్నా బీసీల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉందని బిసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసిన ఘనత బిజెపి దని మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకున్ని చేయగలరా? కనీసం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా చేయగలరా? అని బిజెపి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. తెలంగాణ రాగానే దళితులను ముఖ్యమంత్రి చేస్తాననంటూ వంటి మీరు దళితులకు మోసం చేయలేదా? అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మూడు ఎకరాలకు కాదు కదా ఒక్క సెంటు భూమిని కూడా ఇచ్చిన పాపాన పోలేదని. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పి చివరికి టి ఎస్పి ఎస్సీ పరీక్ష సైతం సరైన విధంగా నిర్వహించలేదని అసమర్ధులైన దద్దమ్మలని, రాష్ట్రంలో నయా నిజం కెసిఆర్ పరిపాలిస్తుంటే లీకుల, లిక్కర్, కమిషన్ల భూకబ్జాల అసమర్ధ ప్రభుత్వం నడుస్తా ఉందని. ఇలాంటి మీరు అన్ని రంగాల్లో వైఫల్యం చెంది అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన కోసం వస్తున్నటువంటి నరేంద్ర మోడీని విమర్శించడం మీ సాయి కాదని మీ సాయిని దిగజార్చుకోవడం అవుతుందని కావున వెంటనే తెలంగాణ ప్రజలకు మోడీ గారికి క్షమాపణలు చెప్పాలని లేనట్లయితే తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడగానే బి ఎస్ ఆర్ నాయకులకు జైలుకు పోవడమే కాదు అనవసరంగా నోరు జారితే ఎర్రగడ్డ కూడా వెళ్లవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించడం మైనది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, ఉపాధ్యక్షులు పల్లె శ్రీనివాస్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులు పెద్దోళ్ల భరత్, దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణ, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఈ రెడ్డి నవీన్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శి భవాని రాము, బారడు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Admin