Wednesday, 29 July 2026 08:07:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ ఏబీ కాంప్లెక్స్ హాల్లో బీజేపీ మేధావులతో సమావేశం... రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రభుత్వం...

Date : 26 June 2023 01:56 AM Views : 1851

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ పాలన చూస్తుంటే 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని, అభివృద్ది, సంక్షేమ పథకాల పేరిట దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ విధానం చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని అత్యవసరంగా సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిఖిల్ ఆనంద్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్ లో బిజేపి అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, బిజెపి సీనియర్ నేతలు దేపల్లి అశోక్ గౌడ్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయా వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు, జర్నలిస్టులు, న్యాయవాదులు తదితర మేధావులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డంగా దోచుకు తింటున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామనే ముసుగుతో వేలకోట్ల రూపాయలను దోచుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబం 50 వేల కోట్ల రూపాయలను వెనకేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో కక్షపూరిత వాతావరణం నెలకొని ఉందని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అటు ప్రతిపక్షాలను ఇటు మేధావులను, మీడియా వర్గాలను అన్నింటిని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ధమనకాండ ప్రారంభించిందని అన్నారు. వేధింపుల పర్వం నానాటికి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి తన అవసరాలకు తన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలకు కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. ఈరోజు మీడియాలో ఎక్కడ చూసినా రోజు కోట్ల రూపాయల తెలంగాణా ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయంటే ఎంత అవినీతి జరుగుతుందో వేరేగా చెప్పనక్కర్లేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఆయా మీడియాల్లో వేలకోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీ పేరిట ప్రభుత్వం తగలేస్తుందని ఆయన విరుచుకుపడ్డారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న మీడియాపై కూడా రాష్ట్రవ్యాప్తంగా జులుం సాగిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్రమంగా ఇంత డబ్బు ఎలా వస్తుందో వాటికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మోడీ పాలనలో కెసిఆర్ ఆయన కుటుంబాన్ని అవినీతి అక్రమాల నుంచి వదిలివేస్తారనుకోవడం ముమ్మాటికి తప్పేనని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ లో అవినీతికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఎన్ని అక్రమాలు చేశారో అవన్నీ మోడీ వద్ద ఉన్నాయని త్వరలోనే వాటికి కార్యరూపం వస్తుందని సూచనప్రాయంగా తెలిపారు. 2.70 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను మించి 300 లక్షల కోట్ల ఖర్చు చేస్తున్నారని సంక్షేమం అభివృద్ధి పేరిట వేలకోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇంత ఆర్థిక భయానక భవిష్యత్తు వాతావరణం ఎప్పుడు చూడలేదని ఏ సర్కార్ సమయంలో వినలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలనపరంగా ఎమర్జెన్సీ ఏర్పడిందని అన్నారు. నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను తలదన్నేలా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించకపోతే అరాచక పాలన ఇంకా ఎక్కువ అవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోక ఇప్పుడు దేశంపై దోచుకునేందుకు పడ్డారని 50 వేల కోట్లను అక్రమంగా సంపాదించుకున్న కేసీఆర్ కుటుంబం ఇప్పుడు రెండు లక్షల కోట్లకు పడిగెత్తెలా ప్రణాళిక రచించారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని కేంద్ర ప్రభుత్వమే లేకపోతే ప్రజలు సంక్షోభంలో పడతారని ఆయన అన్నారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఆర్థిక అండ ఇచ్చిందని అన్నారు. మోడీ 9 ఏళ్ల పాలన పురస్కరించుకొని మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంతో వాస్తవాలు వివరించడానికి ప్రజల ముందుకు వచ్చిందని అన్నారు. మేధావులు ఆలోచించి ప్రజలను మంచి బాటలో నడిచేలా చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి తదితర నాయకులు పెద్ద ఎత్తున డాక్టర్ నిఖిల్ ఆనంద్ ను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులు తదితర వర్గాలతో కలిసి ఫోటోలు దిగారు. ఎమర్జెన్సీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో గతంలో ఆనాడు 18నెలల పాటు జైలుకు వెళ్లిన స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకుడు కమలాకర్ రెడ్డిని డాక్టర్ నిఖిల్ ఆనంద్ తదితరులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి మల్చాల మురళి వంశీ చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలును షాద్ నగర్ రైల్వే స్టేషన్లో ఆపాలని పలువురు వినతిపత్రం అందజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: