సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ , సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా తాప్సి అనిల్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు శ్యాంబాబు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొరివి సతీష్ సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు సోమవారం నియామక పత్రం అందించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అనిల్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు యూనియన్ అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిందిగా అనిల్ కు సూచించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షునికి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అదేవిధంగా యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin