సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువులేనని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడారు.. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే నంటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుద్ధిలేని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్న తెలివి తక్కువ మాటలు అతని రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట అనీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎల్లవేళలా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతోందని అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారని అదేవిధంగా జిఎస్టి, నోట్ల రద్దు విషయాలను తీవ్రంగా వ్యతిరేకించారని, అదే బీఆర్ఎస్ పార్టీ వీటన్నింటికీ మద్దతు పలికిందంటూ శంకర్ విమర్శించారు. ప్రజల అందరి ముందు కయ్యం పెట్టుకున్నట్టు బిజెపి, బీఆర్ఎస్ లు వ్యవహరిస్తాయని లోలోపల మాత్రం ఒకరికి ఒకరు అవసరాల కోసం మద్దతు తెలుపుకుంటారని అన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలు చేసినప్పుడు బిజెపికి సీఎం కేసీఆర్ పార్టీ వత్తాసు పలికిందని గుర్తు చేశారు. అదేవిధంగా కేసీఆర్ అక్రమాల్లో అవినీతి కుంభకోణాల్లో ఉన్నప్పుడు వారిని చూసి చూడనట్టుగా కేంద్ర ప్రభుత్వం కేసుల విషయంలొ వ్యవహరిస్తుందని ఇదంతా ఒక తంతుగా కొనసాగిస్తున్నారని వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక పాలనను అవలంబించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే కూలబోతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు, కర్షకులు, కార్మికులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. నేడు ప్రజా సంపద దోచి ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో అభివృద్ధి చేసుకుంటున్నాడని అన్నారు. ఈరోజు పేదవాళ్లు భారతదేశంలో బతకలేని పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. అప్రజా స్వామికంగా పాలిస్తున్న ప్రభుత్వాలతో ప్రజలకు ప్రమాదం ఏర్పడిందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు మనుగడలేదని గ్రహించి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు తొలి విజయం ప్రజలు అందించారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వాటిని తోసిపుచ్చారని అన్నారు. బండి సంజయ్ కు నేడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శంకర్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని ప్రచారం చేస్తున్నాడని అన్నారు. బిజెపికి బుద్ధి లేదని శంకర్ అన్నారు. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందరో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నో అక్రమ కేసులకు గురయ్యారని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులపై బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దుర్మార్గాలకు దౌర్జన్యాలకు తెగబడిందని అన్నారు. రాష్ట్రంలో క్షణం క్షణం కాంగ్రెస్ శ్రేణులు భయం గుప్పెట్లో బతుకులు వెల్లదీస్తున్నారని శంకర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నది కాంగ్రెస్ శ్రేణులేనని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఇలా ఉంటే బిజెపి మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని బండి సంజయ్ తీరుపై శంకర్ ధ్వజమెత్తారు. అసలు బిజెపి, బీఆర్ఎస్ లోపకారి ఒప్పందాలను ప్రజల ముందు పెడతామని శంకర్ అన్నారు. బీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలకు నూకలు చెల్లాయని శంకర్ అన్నారు. ఎల్లప్పటికి బీఆర్ఎస్, బిజెపి తమకు బద్ధ శత్రువులేనని శంకర్ స్పష్టం చేశారు. రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని కర్ణాటక కన్నా మించి విజయాన్ని తెలంగాణ ప్రజలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పి రఘు, చల్ల శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, కొవ్వూరి పురుషోత్తం రెడ్డి, శ్రీను నాయక్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin