సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శివనగర్ లో మున్సిపల్ పారిశుద్ధ్య ఆటో డ్రైవర్ యమ్మన మల్లికార్జున్ మాతృమూర్తి, శతాధికురాలు [102సం:లు] వయస్సున్న యమ్మన లక్ష్మీ నర్సమ్మ మృతి చెందారు. ఆదివారం శివనగర్ లోని స్వగృహంలో ఆమె భౌతికకాయానికి DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె కుమారులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పులి సత్యనారాయణ, బొందిల రాంబాబు, యమ్మన రమణ, యమ్మన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin