సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు బోట్ల కార్తీక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లా అధ్యక్షులు దండ నరేష్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండల ఉప సర్పంచుల ఫోరం లో జరిగిన ఎన్నికల్లో దుగ్గొండి మండల ఉప సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గా శంభాయిపల్లి గ్రామానికి చెందిన అసోలా సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఎన్నిక అనంతరం జిల్లా అధ్యక్షులు దండ నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు పై వస్తున్న వార్తలను ఖండించి వాస్తవాలను తెలియపరచాలని కోరుకున్నారు అదేవిధంగా ఉప సర్పంచుల హక్కులను కాపాడాలని మాట్లాడారు అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు. దుగ్గొండి మండల ఉపసర్పంచుల పోరం వర్కింగ్ ప్రెసిడెంట్ అసోలా సురేష్ మాట్లాడుతూ నాకిచ్చిన పదవికి కట్టుబడుతూ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటానని ఎల్లవేళలా ప్రతి ఒక్క ఉప సర్పంచ్ల కు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
-----------------------
Reporter