సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డు నందు టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఇందిరాల అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో ముత్యాలమ్మగుడి వద్ద మరియు సీఎస్ఐ చర్చి నందు ప్రార్థనలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా హుజూర్ నగర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి ,15వ వార్డు కౌన్సిలర్ కేఎల్ఎన్ రావులు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని కొత్త పాత తేడా లేకుండా అందరూ సమానంగా చూసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అలవాల నరేష్ ,వసంత్, బూత్ కన్వీనర్ శిగ సత్యనారాయణ, విద్యాసాగర్, మహిళా నాయకులు ఆర్ ప్రశాంతి మాదారాణి మద్దెల మంగతాయారు, మామిడి కాoతమ్మ, మామిడి బెంజ్, రాధ, సుధాకర్, ఇస్సక్, బండి నాగేశ్వర్రావు, సోషల్ మీడియా ఇన్చార్జులు గొర్రె వీరబాబు మాదా వినయ్ లు పాల్గొన్నారు.
-----------------------
Admin