సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో బెల్టు షాపు యజమానులు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు మద్యం అమ్మకాలు చెయ్యడం ద్వారా సామాన్యు ప్రజలను పిండేస్తున్నారు అమ్మకాలు ఎంఆర్పికి మించి దాదాపు 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు మందును అమ్మతున్నారని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మరియు ఎమ్మార్పీఎస్ దుగ్గొండి మండల అధ్యక్షుడు గూడపు అమరేందర్ ఆరోపించారు దుగ్గొండి మండలంలోని రెండు బ్రాండ్ షాపుల యజమానులతో కుమ్మక్కై బెల్ట్ షాపులకు అమ్ముతూ బ్లాక్ దందా చేస్తున్నారని ఇలాంటివి ఇలానే కొనసాగితే గ్రామాలలో మధ్యతరగతి కుటుంబలు విదిన పడుతాయాన్ని మండిపడ్డారు ఎక్స్చేంజ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వైన్ షాపు యజమానుల పై బెల్ట్ షాపుల యజమానులపై చర్య చేపట్టాలని లేదంటే ఎమ్మార్పీఎస్ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ తరఫున సమాచారం కోరి ప్రతి ఒక్క అధికారిపై చర్య తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
-----------------------
Reporter