సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా పెద్ద మసీద్ కి ముస్లిం సోదరులు అందరూ ప్రతి రోజు వచ్చి నమాజ్ చేసుకొని వెళ్తుంటారు . వచ్చిన వారు త్రాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతుంటే మసీద్ లోకి దాదాపు 1,54,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ మరియు షెడ్డు ఏర్పాటు చేయించి ముస్లిం సోదరులకు అందించారు. అలాగే నియోజక వర్గం వ్యాప్తంగా పీర్ల పండుగకు ఎప్పుడూ నా సహకారం ఉంటదని కొన్ని గ్రామాలలో పీర్ల చావిడి లు ఏర్పాటు చేశామని మరి కొన్ని గ్రామాలలో వాటర్ ప్లాంట్ లు అందించాం అని మరియు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశామని అలాగే రంజాన్ పండుగకి తోఫాలు అందించాం అని చెప్పడం జరిగింది.ముస్లిం సోదరులనదరు నా స్వంత కుటుంబ సభ్యులలా భావిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మసీద్ పెద్దలు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin