సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి లోని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో జరిగిన బీసీ కమిటీ సమావేశంలో టీపీసీసీ బీసీ డిక్లరేషన్లో పొందు పరచవలసిన అంశాలపైన కమిటీ సభ్యులు చెప్పిన విషయలపై చర్చించడం జరిగింది. ఓబీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకట్ స్వామి అధ్యక్షత వహించగా మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఓబిసి స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, మురళీమోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు, బీసీ సమాజ్ జనరల్ సెక్రటరీ సూర్యారావు మరియు బీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్హులైన యాదవులకు 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి : నాగా సీతారాములు, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న అర్హులైన యాదవులకు 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకట్ స్వామికి మెమోరాండం ఇచ్చి సన్మానం చేశారు. సన్మానం చేసిన యాదవ్ నాయకుల్లో అఖిల భారత యాదవ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్, మహబూబబాద్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వీరన్న యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జనరల్ సెక్రటరీ అచ్యుత యాదవ్ ఉన్నారు.
-----------------------
Admin