సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తూ వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గతంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మొదలై, దుగ్గొండి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు సేవలు అందించారు. ఆయనకు పార్టీ కార్యకర్తలతో పాటు నాయకుల మధ్య మంచి అనుబంధం ఉందని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ నియామకం పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
-----------------------
Reporter