Wednesday, 29 July 2026 11:19:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన పట్ట భద్రులు ఫారం 18 ను ఫిబ్రవరి 6 వతేదిలోగా దరఖాస్తు చేసుకోవాలి...

Date : 12 January 2024 10:48 AM Views : 361

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంకు జరుగనున్న ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు నమోదుకు పట్టభద్రులు దరఖాస్తులు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం పట్టభద్రులు ఓటు హక్కు నమోదుపై ఐడిఓసి కార్యాలయంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గానికి సంబందించి ఓటర్ నమోదు దరఖాస్తులు స్వీకరణ, పరిష్కారంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఓటర్ నమోదు గురించి ఓటర్లకు సహాయ రిటర్నింగ్ అధికారులు, డిసిగ్నేటెడ్ అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి వారం నియోజక వర్గాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితా రూపకల్పన పై వివరించాలని అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గానికి సంబందించి అర్హులైన పట్ట భద్రులు ఫారం 18 లో ఫిబ్రవరి 6 వతేదిలోగా దరఖాస్తు చేయాలని అన్నారు. ఫిబ్రవరి 24 న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ చేస్తామని తెలిపారు. ముసాయిదా ఓటరు జాభితా ప్రకటన తదుపరి ఫిబ్రవరి 24వ తేది నుండి మార్చి 14వ తేది వరకు అబ్యంతరాలు స్వీకరిస్తామని, మార్చి 29వ తేదీ వరకు వచ్చిన అన్ని క్లెయిమ్స్ పరిష్కరించి, ఏప్రిల్ 4వ తేదీన తుది ఓటరు జాభితా ప్రకటిస్తామని చెప్పారు. నవంబర్ 1, 2023 అర్హత తేదీకి 3 సంవత్సరాల ముందు అనగా నవంబర్ 2, 2020 నాటికి ఓటరుగా నమోదయ్యే వ్యక్తులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. డిగ్రీ ఫలితాలు ప్రకటించిన తేదీ అనగా నవంబర్ 1, 2023 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పట్టభద్రులై ఉండాలని, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు డిజిగ్నేటెడ్ అధికారి లేదా గెజిటెడ్ అధికారులచే ధృవీకరణతో దరఖాస్తు చేయాలని అన్నారు. చిరునామా కొరకు ఓటరు నమోదు ఫారంతో పాటు ఎపిక్ కార్డు, ఆదార్ కార్డు జిరాక్స్ ప్రతులు జతపరచాలని చెప్పారు. పట్టభద్రుల నూతన ఓటరు జాభితా తయారు చేస్తున్నందున గతంలో ఓటు హక్కు కలిగిన ఉన్న పట్ట భద్రులు సైతం తిరిగి నూతనంగా దరఖాస్తు చేయాలని చెప్పారు. పట్ట భద్రుల నియోజక వర్గం ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటరు నమోదు చేయాలని అన్నారు. దరఖాస్తులు పటిష్ట భద్రపరచాలని సూచించారు. పట్ట భద్రులు ఓటు హక్కు నమోదుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలల్లో అవగాహన కల్పించాలని, ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టభద్రుల నియోజక వర్గ ఉప ఎన్నిక ఓటరు జాబితా రూపకల్పన ఎన్నికల సంగం నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు, డిఆర్వో రవీంద్రనాథ్, అన్ని మండలాల తహసిల్దారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :