Wednesday, 29 July 2026 10:21:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఉద్యోగుల్లో అలజడి...

Date : 03 May 2023 11:31 PM Views : 2231

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వాసుపత్రులలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం ఓబుల్ దేవర చెరువు, ఆమడగూరు , అంగన్వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు . పీహెచ్సీలో వైద్యులు సిబ్బంది వివరాలను సిహెచ్ఓ సుభాషిణిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు మందుల వివరాలు పరిశుభ్రతపై ఆరా తీశారు.  పారిశుద్ధ్యం పరిశుభ్రతకు ఆసుపత్రులు చిరునామాగా  ప్రభుత్వాసుపత్రులు నిలవాలని తెలిపారు. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని.. వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ను  సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ సచివాలయం వారీగా జన సంఖ్యను పరిగణలోకి తీసుకుని.. వయస్సు వారీగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించాలన్నారు. ఏఎన్ఎం, ఆశ, సిహెచ్ఓ లతో ప్రతివారం సమావేశం ఏర్పాటు చేసుకొని ఆరోగ్య కేంద్రాల పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై తగు సూచనలు చేయాలని చెప్పారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందుల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి మహమ్మదాబాద్ క్రాస్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని అంగన్వాడి సూపర్వైజర్ జయమ్మ కు కలెక్టర్ సూచించారు.  స్టాక్ రిజిస్టర్  పరిశీలించారు, ఫుడ్ బ్యాలెన్స్ పరిశీలించారు, పిల్లల రిజిస్టర్ను నమోదు ప్రక్రియను ఆరా తీశారు. రెండవ ప్రధాన్యతగా బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. మండలంలోఎక్కడా కూడా పోషకాహార లోపం, మాల్ న్యూట్రిషన్ పిల్లలు గానీ, రక్త హీనతతో మహిళలు గానీ కనిపించకూడదన్నారు. సచివాలయ స్థాయి నుండి మండల స్థాయి వరకు కుడా వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఎస్వీ కృష్ణారెడ్డి, ఎమ్మార్వో పి శ్రీధర్, యువోపిఆర్డి రాజశేఖర్, అమ్మడు గురు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :