సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : హైదరాబాద్ లో విశ్వేశ్వరయ్య భవనంలో జనవరి 8న బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విద్యుత్ బీసీ ఉద్యోగుల 19వ రాష్ట్ర మహాసభ ఘనంగా జరగనుంది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, విద్యుత్ బీసీ సంఘం సలహాదారులు ఆర్. కృష్ణయ్య , ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. ఈ మహాసభలో విద్యుత్ సంస్థల్లో ఉన్న ప్రధాన సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లపై చర్చించనున్నారు. విద్యుత్ బీసీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు కోడెపాక కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ సోమవారం పత్రిక ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మహాసభలో ప్రస్తావించనున్న ప్రధాన డిమాండ్లు జూన్ 2, 2014 తర్వాత ఇచ్చిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి.మెరిట్ ప్రాతిపదికన సీనియారిటీలను ప్రకటించి ఇప్పటికే ఇచ్చిన పదోన్నతులను రెగ్యులర్ చేయాలి. 1999 నుండి 2004 వరకు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఈ సభ కు బీసీ ఉద్యోగస్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మేంద్రరావు, ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రుడు, నల్గొండ జిల్లా అధ్యక్షులు గంజి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వై.వి.గిరి, బచ్చు రామ్ చందర్, సీతారాములు, చంద్రశేఖర్, రామ్మూర్తి, సత్యనారాయణ, ఈశ్వర్ తదితరులు పాల్గొంటారు...
-----------------------
Admin