సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణ కేంద్రం లోని బిషప్ సి. హెచ్. సాల్మన్ రాజు హౌస్ వద్ద జరిగిన భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్బంగా మణిపూర్ క్రైస్తవులపై హింసాత్మాక ఘర్షణ పై శాంతి నెలకొల్పలని బిషప్ సి. హెచ్. సాల్మాన్ రాజు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ సందర్బంగా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డా దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ / యశు భక్తి దివస్ అనేది క్రీ"శకం.52 లో అపొస్తలలు సెయింట్ థామస్ ద్వారా భారతదేశానికి యేసు క్రీస్తూ సందేశాన్ని తీసుకురాబడినదని జులై 3 న జరుపుకునే వార్షిక దినోత్సవం.ఈసంస్మరణదినం దాదాపు2,000సంవత్సరాల సుసంపన్నమైన క్రైస్తవ చరిత్ర మరియు భారతదేశ సంస్కృతికి, సమాజానికి మరియు దేశ నిర్మాణానికి క్రైస్తవ విశ్వాసం అందించిన సహకారాన్ని గుర్తు చేస్తుందనీ యేసు యొక్క మిగిలిన పదకొండు మంది అపొస్తలులలో ప్రతి ఒక్కరు క్రీస్తు ఆరోహణ తర్వాత తెలిసిన ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి యేసు క్రీస్తూ (జీసస్) గురించి యూదు ప్రవాసులకు చెప్పడానికి ఎంచుకున్నారని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయనీ అన్నారు.అపోస్తులు సెయింట్ థామస్ కొన్ని సంవత్సరాల తరువాత క్రీ.శకం.52 లో, థామస్ అరేబియా ద్వీపకల్పంలోని ఓడరేవులలో ఒకదాని నుండి ముజిరిస్‌కు ప్రయాణించే వ్యాపారి పడవపై ప్రయాణించాడు ముజిరిస్ భారతదేశ పశ్చిమ తీరంలో చేరరాజ్యంలో ఒక ప్రధాన నౌకాశ్రయంగా ఉండేది.ఇది ఆధునిక భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉంది. క్రీ.శకం 1వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తమిళగం అని పిలిచేవారు.ఈ ప్రాంతం అంతటా ఉన్న యూదులు వ్యాపారులకు సువార్త ప్రకటించడమే కాకుండా, థామస్ తమిళనాడు అంతటా స్థానిక ప్రజలలో గొప్ప అనుచరులను సంపాదించుకున్నాడు. అతను ఇక్కడ స్థానిక ద్రావిడ ప్రజలలో అనేక అనుచరుల సంఘాలను స్థాపించాడు.కొన్ని సంవత్సరాల తరువాత, థామస్ భారతదేశ తూర్పు తీరానికి చేరుకున్నాడు.అక్కడ కూడా, అతను పెద్ద సంఖ్యలో అనుచరుల సంఘాలను స్థాపించాడు, థామస్ చివరకు క్రీ. శకం.72 లో భారతదేశంలోని ఆధునిక నగరమైన మద్రాస్ (చెన్నై) సమీపంలో సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడే ప్రదేశంలో హతసాక్షి అయ్యాడు. అతని మృతదేహాన్ని మైలాపూర్ అనే ప్రదేశంలో కొన్ని మైళ్ల దూరంలో ఉన్న చర్చిలో ఖననం చేశారు.మైలాపూర్ యొక్క ప్రదేశాన్ని శాంతోమ్ అని పిలువబడిందనీ మైలాపూర్ నుండి అపొస్తలుడైన థామస్ యొక్క అవశేషాలను తిరిగి గుర్తించమని ఎడెస్సా యొక్క పాట్రియార్చేట్ నుండి క్రీ. శకం.3వ శతాబ్దం లో గిషువాంగ్ రాజు ద్వారా ఒక అభ్యర్థన అందిందని చారిత్రక రికార్డులు చూపిస్తున్నాయనీ,రాజు పేరు బజోడియోస్ I ( క్రీ. శకం 190 - 230 )గా ఇవ్వబడింది. గుయిషువాంగ్ సామ్రాజ్యాన్ని సింధు ప్రాంతాలలో కుషాన్ సామ్రాజ్యం అని పిలుస్తారు,మరియు కింగ్ బజోడియోస్ I రాజు వాసుదేవ I (క్రీ. శకం 190 - 230) అని పిలిచేవారు అపొస్తలుడైన థామస్ యొక్క అవశేషాలను రాజు బోజోడియోస్ అపొస్తలుడి పట్ల తనకున్న గౌరవానికి గుర్తుగా వ్యక్తిగతంగా ఎడెస్సాకు తీసుకువచ్చినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఎడెస్సాకు అవశేషాలను తీసుకువచ్చిన అపొస్తలుడు మరియు రాజు బజ్డియో కుటుంబానికి గౌరవార్థం చర్చి జూలై 3న విందు జరుపుకుంటుంది. ఈ సంఘటన క్రీ.శ.232లో జరిగినట్లు కొన్ని రికార్డులు సూచిస్తున్నాయి.వాస్కో డ గామా క్రీ.శకం 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పోర్చుగీసు నావికుడు. ఇతడు పోర్చుగల్ దేశస్థుడు. 1498లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడనీ. వాస్కోడగామా బృందము మొట్టమొదట కాలికట్లో కాలుమోపింది.కేరళ రాష్టం లోని కొచ్చి నందు తేది 24 డిసెంబర్ 1524మరణించిన వారి సమాధి ఇప్పటికీ వున్నది అనీ,భారత దేశానికి బ్రిటిష్ వాళ్ళు సువార్త తేలేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ, విద్వేషాలు పుట్టిస్తూ,దేశాన్ని, ప్రజలను విభజిస్తూన్నారని అన్నారు.ఇప్పటికే మణిపూర్ రాష్టంలో 500 పైగా చర్చ్ లను ద్వాసం చేశారని,100 ల మంది క్రైస్తవులు చనిపోయారనీ, కొన్ని వేల మంది నిరాశ్రాయులుగా కుడు, గుడ్డలు లేక తల్లి దండ్రులు పిల్లలు కలవలేని స్థితి లో ఉండటం బాధాకరం అనీ, ఇది ముమ్మాటికీ రాజ్యాంగం ఊళ్ళంగానే అనీ ఆవేదన వ్యక్తం చేశారు, క్రైస్తవ్యం మన ఆసియా ఖండం ఇజ్రాయెల్ నుండి వచ్చింది కానీ పాశ్చత దేశాలనుండి వచ్చింది కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో రెవ. బొక్క ఏలీయా రాజు సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు, రెవ. డా.జలగం జేమ్స్, రెవ. పి. వి. బోయాజ్, రెవ. వరికుప్పల మత్తయి, రెవ. డా. పంది మార్క్ నూతనకల్ మండలం అధ్యక్షులు, రెవ. గుగులోత్ బాలాజీ నాయక్ చివ్వేంల మండల అధ్యక్షులు,రెవ. డా. తాడంకి కిరణ్ బాబు,పాస్టర్ వి. పిలిప్పు,డికెన్ ఫాదర్ శ్యాగ యాకుబ్, పాస్టర్ రెవ జలగం సామ్యూల్, పాస్టర్ కొమ్ము హోసన్నా, పాస్టర్ జి. ఒనెషిమ్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin