సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గత కొన్ని రోజులుగా సంఘం లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షునిగా బజ్జూరి రవీందర్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది. డివిజన్ సహకార బ్యాంకు ఆడిటర్ సిహెచ్. అంబేద్కర్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ హుజూర్ నగర్ సబ్ డివిజన్ బి. అంజయ్య పర్యవేక్షణలో సంఘం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులను జిల్లా సహకార అధికారి సూర్యాపేట 6 జనవరి 2023 ఆర్ సి నెంబర్ 596/2022 ద్వారా తొలగించడం జరిగినది. జిల్లా సహకార అధికారి సూర్యాపేట 12 జనవరి 2024 ఆర్ సి నెంబర్ 2289/2023 - సి ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, సంఘ సభ్యులకు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అవసరాల దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షుని ఎన్నుకొనుటకు గాను మరియు జిల్లా సహకార అధికారి సూర్యాపేట ఉత్తర్వులు ఆర్ సి నెంబర్ 586/2022 - సి, 6 జనవరి 2024 ప్రకారం సంఘం అధ్యక్షులు భాషo సైదులు మరియు ఉపాధ్యక్షులు అక్కినేపల్లి జానకి రామాచారి లను వారి పదవుల నుండి పాలక వర్గ సభ్యులుగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. ప్రస్తుత జిల్లా సహకార అధికారి సూర్యాపేట వారి ఆదేశాల మేరకు ఆర్ సి నెంబర్ 2289/2022 - సి 12 జనవరి 2024 ప్రకారం మిగిలిన పాలకవర్గ సభ్యులకు గాను అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘమునకు తాత్కాలిక అధ్యక్షునిగా మరియు కార్యకలాపాలు సంఘము తరపున నడుపుటకు గాను, సంఘం కార్యవర్గ సభ్యులలో ఒకరైన బజ్జూరి రవీందర్ రెడ్డిని తాత్కాలిక అధ్యక్షునిగా ఏకగ్రీవంగా సంఘ పాలకవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. సంఘ తాత్కాలిక అధ్యక్షునికి సంఘం తరఫున రోజువారి కార్యకలాపాలు మరియు సంఘ సభ్యుల సౌకర్యార్థం నిర్వహించు లావాదేవీలకు సంబంధించి చెక్కు పవర్ ఇవ్వడం జరిగింది. అత్యవసర సమావేశాలలో పాలక వర్గ సభ్యులు తీర్మానం చేసిన ప్రతులను జిల్లా సాకార సంఘం అధికారి సూర్యాపేటకి మరియు నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కోదాడ బ్రాంచ్ మేనేజర్ కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు పాలక వర్గ సభ్యులు తాత్కాలిక అధ్యక్షుని అభినందించడం జరిగింది.
-----------------------
Admin