సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జరిగిన జంట హత్యల నిందితున్ని పోలీసులు 6 గంటల్లోనే చేదించారు. నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన దివాకర్ గా గుర్తించారు. మృతురాలి పార్వతమ్మ ఇంట్లో కొన్ని రోజులుగా దివాకర్ అద్దెకు ఉండేవాడు. పది రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశాడు. ఎప్పటినుండో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ వద్ద ఉన్న బంగారంపై కన్ను వేసిన దివాకర్ శుక్రవారం రెండున్నర గంటల సమయంలో తెల్లవారుజామున బాలిక భానుప్రియ(9) గొంతు కోసి హత్య చేసి, పార్వతమ్మ(58) ను తీవ్రంగా గాయపరిచాడు. శుక్రవారం సాయంత్రం పార్వతమ్మ, భానుప్రియ ఎంతవరకు ఇంటి నుండి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బాలిక చనిపోయి ఉండి పార్వతమ్మ కొన ఊపిరితో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు పార్వతమ్మను షాద్నగర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో చికిత్స చేపట్టిన కొద్ది సేపటికి ఆమె మృతి చెందింది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి పరిశీలించి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేయించారు. నందిగామ ఇన్స్పెక్టర్ రామయ్య తనదైన శైలిలో విచారణ చేపట్టి నిందితున్ని ఆరు గంటల లోపే పట్టుకున్నారు. కొన్ని గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడంతో నందిగామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. నిందితున్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
-----------------------
Admin