Wednesday, 29 July 2026 07:08:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డిప్యుటేషన్ల రద్దును నిలుపుదల చేయండి... -హై కోర్టుకు కొత్తగూడెం బార్ అసోసియేషన్ విజ్ఞప్తి

Date : 21 December 2023 02:51 AM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విభజించినప్పుడు కొత్తగూడెంలో కోర్టు సిబ్బంది కొరత కారణంగా, ఖమ్మం జిల్లా నుంచి డిప్యుటేషన్ పై పంపిన 18 మంది సిబ్బంది యొక్క డిప్యుటేషన్లను రద్దు చేస్తూ తెలంగాణా హై కోర్టు ఈ నెల 14న జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కొత్తగూడెం అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కుమార్ మక్కడ్, రావిలాల రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, తెలంగాణ హై కోర్టు జడ్జి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ను బుధవారం ఉదయం హై కోర్టులోని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు జడ్జిని బార్ అసోసియేషన్ తరపున శాలువతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందించారు. కొత్త సిబ్బంది నియామకం జరిగే వరకు ఖమ్మం జిల్లా నుంచి డిప్యుటేషన్ పై పని చేస్తున్న 18 మంది సిబ్బంది యొక్క డిప్యుటేషన్ రద్దు చేయరాదని కోరుతూ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన జస్టిస్, సానుకూలంగా స్పందిస్తూ, న్యాయవాదులకు, న్యాయమూర్తులు, కక్షిదారులకు ఇబ్బంది ఏర్పడకుండా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తదనంతరం భద్రాద్రి వాసి అయిన జస్టిస్ నగేష్ భీమపాక ను కలిసి సమస్య యొక్క తీవ్రతను వివరించగా, సమస్య పరిష్కారం లో తోడ్పాటు నందిస్తానని అన్నారు. హై కోర్టు రిజిస్ట్రార్ జనరల్ (అడ్మిన్) బాల భాస్కర్ ను కలువగా, ఈ సమస్య విషయమై నోట్ తయారు చేయమని తమకు జస్టిస్ వేణుగోపాల్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయని ధృవీకరించారు. ఈ మొత్తం కార్యక్రమంలో తమ వెంట ఉండి తమకు సహాయపడిన హై కోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్ రావుకు రమేష్ కుమార్ మక్కడ్, రావిలాల రామారావు కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :