సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశానుసారం మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా మిర్యాలగూడ డి.ఎస్.పి సూచనల మేరకు మంగళవారం డాక్టర్స్ కాలనీలో మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ యాదవ్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి హాస్పిటల్లో ముందు వాహనాలు అడ్డగోలిగా పార్క్ చేయటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతు న్నాయని, కనీసం అంబులెన్స్ వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి ఉందని,రోడ్లపై షాపుకు సంబంధించిన వారు ఫ్లెక్సీ బోర్డులను పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.హాస్పిటల్ నిర్వాహకులు,సిబ్బంది వాహనాలను పార్కు చేసుకునే విధంగా సెల్లార్లు ఉన్నప్పటికీ వాహనాలను రోడ్లపై పెడుతున్నారని,వాహనాలు రోడ్ల పై పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు.హాస్పిటల్ యజమానులు తమ షాపుల ముందల వాహనాలను రోడ్ల పై అడ్డగోలుగా పార్కు చేస్తే కేసులు చేస్తామని హెచ్చరించారు.హాస్పిటల్ యజమానులతో,మెడికల్ షాప్ వారితో కలిసి ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ హాస్పిటల్ లో పని చేసే వారి స వాహనాలే ఎక్కువ వుండటం వల్ల,హాస్పటల్ కు వచ్చేవారు వారి వాహనాలు ఎక్కువ అయ్యి రోడ్ల పై అడ్డగోలుగా పార్కు చేస్తున్నారని, ఎమర్జెన్సీ అంబులెన్సులు వెళ్లాలన్న,పనుల నిమిత్తం ఈ రోడ్లలో వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి ఉందని,ప్రతి హాస్పిటల్ వారు సెక్యూరిటీనీ ఏర్పాటు చేసుకుని వాహనాలను రోడ్ల పై పెట్టకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.త్వరలో హాస్పటల్ సిబ్బంది వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది అక్రమ్,చంద్ర శేఖర్,క్రాంతి కుమార్,నాగరాజు,సుమన్ నాయక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin