Friday, 08 May 2026 09:24:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

దళితులపై దాడి ఘటన కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలి...

Date : 22 October 2024 08:03 AM Views : 768

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో దనరా పండుగ రోజు కనకదుర్గమ్మ ఉత్సవాల సందర్భంగా దళితులపై జరిగిన దౌర్జన్యంపై నిస్పక్షపాత విచారణ జరిపి యస్సీ, యస్టీ అట్రాసిటి కేసు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హాస్సేన్,డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపీ లు అన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కోరుతూ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ రోజు బేతవోలు గ్రామంలో జరుగుతున్న కనకదుర్గమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆ గ్రామానికి చెందిన బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వట్టికూటి నాగయ్య అనే వ్యక్తి గుడిలో మూత్ర విసర్జన చేస్తుండగా ప్రశ్నించిన దళితులపై అకారణంగా మూకుమ్మడిగా 70 మంది అనుచరులతో వచ్చి దాడి జరిపారని అన్నారు. ఘటన జరిగిన సందర్భంగా అక్కడే ఆ గ్రామానికి ఎలాంటి సంబంధం లేని దర్శనం కోసం వచ్చిన కోదాడ టౌన్ సిఐ మరియు ఇతర పోలీసులు కలిసి బాధితులైన దళితులపైనే లాఠిఛార్జ్ చేసి వారి మీదనే అక్రమ కేసులు పెట్టారని అన్నారు. దళితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా వారిపట్ల కోదాడ రూరల్ సీఐ దురుసుగా ప్రవర్తించి దళితుల అవమానపరిచే విధంగా గెట్ అవుట్ అంటూ స్టేషన్ నుంచి బయటికి వెళ్లగొట్టిందని అన్నారు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా పిటీషన్ మార్చి నిందితులకు అనుకూలంగా మరో పిటిషన్ వ్రాయించారని తెలిపారు. కోదాడ డిఎస్పి, కోదాడ రూరల్ సీఐ లు రాజకీయాలకు తలొగ్గి నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితులకు తీవ్ర అన్యాయం చేస్తూ నిందితులకు కొమ్ముగాసే విధంగా వ్యవహరిస్తూ బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి 307 కింద కేసు నమోదు చేయడం సరికాదన్నారు. దళితులపై దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అట్రాసిటీ కేసు నీరు గార్చే విధంగా చేస్తున్న కోదాడ డిఎస్పి కోదాడ రూరల్ సిఐ ల పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు అనేది కూడా చూడకుండా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు లక్ష్మి ఆమె కోడలు రాణి పై 307 కేసు రాజకీయ ఒత్తిడితో పెట్టారని తెలిపారు. దళితులు చైతన్యవంతులై గ్రామంలోని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అకారణంగా దళితులపై మూకదాడి చేసి అక్రమంగా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. వెంటనే దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దళిత మహిళలను జైలు నుంచి విడుదల చేయాలని అట్రాసిటీ కేసులోని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని అన్నారు.ఈ కేసు పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దళితులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ స్పందించి ఎంక్వయిరీ చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపినట్లు సంఘాల నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు మాల మహానాడు జిల్లా నాయకులు బొల్లెద్దు వినయ్ కట్ట మురళి ఎంఆర్పిఎస్ చిలుకూరు మండల అధికార ప్రతినిధి వంగూరి రమేష్ దళితులు రామకృష్ణ,మరియమ్మ,శ్రీకాంత్,శివ,నవీన్,బూబమ్మ,రాజీవ్,వీరయ్య,సుమతి,విజయ,రమణ,తిరపయ్య తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :