సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి హక్కుల గురించి పోరాడాలి బాధ్యతలు సక్రంగా నిర్వర్తించాలి. మహిళలు ముందుండి అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసిడిఎస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి పనికి సమయం కేటాయించడం చాలా ముఖ్యమని, మన ఆరోగ్యానికి, వృద్ధికి, మన కుటుంబ సభ్యులకు కూడా సమయం కేటాయించాలన్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లల పట్ల చాలా శ్రద్ధ పెట్టాలన్నారు. తల్లి తన బాధ్యతలను విస్మరించకూడదని, బిడ్డలతో ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సమయం కేటాయించాలన్నారు. మాటలతో కాకుండా మన ఆచరణతో పిల్లలకు ఆదర్శాలు నేర్పాలన్నారు. మహిళలు తమ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలన్నారు. పిల్లలకు మంచి ప్రవర్తన గురించి ఎక్కువ శాతం తల్లిదండ్రుల శిక్షణ పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ సత్సంబంధాలు కలిగి ఉంటారని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయాలలో 60శాతం మంది మహిళలే ఉన్నారని వారిలో మహిళా పోలీసు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, మహిళ ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో ఉంటారని తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఐసీడీఎస్ శాఖ మరియు విద్యాశాఖ వైద్యశాఖ సంయుక్తంగా కలిసి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. మహిళలు చక్కగా పనిచేసే బాధ్యత వారి బ్లడ్ లోనే ఉన్నదని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారని వారిని వారిని గుర్తించి వారికి మంచి వైద్య సేవలు అందించాలని అటువంటి సేవ మీరు సేవలు చేయాలని తెలిపారు. మహిళల ఆరోగ్యం కొరకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ ఉన్నదని తెలిపారు. ప్రతి మండలం ఆరోగ్య కేంద్రాలలో పుష్కలంగా మందులు ఉన్నాయని వాటిని విరివిగా ఉపయోగించాలని ప్రజలకు మీ సేవలు ఉండాలని. బాలింతలు ,చిన్నపిల్లల ఆరోగ్యం, మీరు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారిని చైతన్యవంతులు చేయాలని తెలిపారు కొన్ని మరణాలను మనమే నివారించుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్లలో అధిక సంఖ్య విద్య ,వైద్యం, ఐసిడిఎస్ శాఖలకు అధిక ప్రాధాన్తిస్తూ ఉన్నదని 100 రూపాయల లో 70 రూపాయలు పై వాటికే ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నదని తెలిపారు ప్రజల్లో రోగ నిరోధిక శక్తి పెంపొందేలా ఫ్యామిలీ డాక్టర్ పరీక్షలు నిర్వహణ మరియు చికిత్సలు చేపట్టాలని అన్నారు. గర్భిణీలకు, వారి ప్రసవానంతరం అందించే సేవలు, అనీమియా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, హై రిస్క్ గర్భవతులకు వారం రోజుల ముందుగానే ప్రసవ సమయం అంచనా వేసి ఆసుపత్రుల్లో సుఖ ప్రసవం జరిగేలా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా తరలించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోషన్- ప్లస్ అందించడం ద్వారా మధ్యస్థ మరియు తీవ్ర అనీమియా నుండి గర్భిణీలు, 19 సంవత్సరాల లోపు పిల్లలు బయట పడవచ్చని అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన -2023 మొదటి విడత కార్యక్రమాన్ని ఈ నెల 14న చేపట్టి విజయవంతం చేయాలనీ అన్నారు. సికిల్ సెల్ అనీమియా నివారణలో వైద్య శాఖ మార్గదర్శకాలు అమలు చేయాలనీ, ఎండలు, వడగాలులు అంచనాలు ఉన్నందున పీహెచ్ సి స్థాయిలో అందుబాటులో ఓఆర్ఎస్ స్యాచేట్ లు అందుబాటులో ఉంచుకోవాలని, పాఠశాలల్లో తగినంత త్రాగు నీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రజలు మధ్యాహ్నం 12 గం. నుండి 3 గం. వరకు అవసరం ఉంటే మాత్రమే బయట తిరగాలని సూచించారు.ఈ సమావేశంలో డిఈఓ మీనాక్షి, సోషల్ వెల్ఫేర్ డిడి శివ రంగ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఐసిడిఎస్ నోడల్ ఆఫీసర్ గాయత్రి, ఎన్జీవో సంస్థ ప్రతినిధి భానుజ, హ్యాపీ హోమ్ ఎన్జీవో సంస్థ ప్రతినిధి రజిత, తాసిల్దారు, ఎంపీడీవో, ఐ సి డేస్ సిడిపివోలు, సూపర్వైజర్లు,ఎంఈఓ వెంకటరమణ నాయక్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నరు....
-----------------------
Admin