సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణలో ఉన్న ట్రైనీ ఐ పి ఎస్ అధికారి రాజేష్ మీనా సూర్యాపేట జిల్లాలో 6 నెలల శిక్షణ నిమిత్తం విధులకు రిపోర్ట్ చేసినారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ ని జిల్లా పోలీసు కార్యాలయం నందు కలిసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ జిల్లా భౌగోళిక స్థితిగతులు, క్రైమ్ రిపోర్టర్ గురించి వివరించారు. అనుభవాలను వివరించి శిక్షణ కాలంలో నేర్చుకోవాల్సిన అంశాలపై సూచనలు, సలహాలను అందించారు. ఈ 6 నెలల శిక్షణ కాలంలో ట్రైనీ అదికారి మండల పోలీస్ స్టేషన్లు, పట్టణ పోలీస్ స్టేషన్లు, క్షేత్ర స్థాయిలో పోలీసు విధులు, పోలీస్ అడ్మనిస్ట్రేషన్, కేసుల దర్యాప్తు, కోర్టు విధులు, క్రైమ్ రికార్డ్స్, ఇంటలిజేన్స్ విధులు, ఎస్ హెచ్ ఓ,ఎస్ డి పి ఓ విధులు మొదలగు వాటిపై క్షేత్ర స్థాయిలో శిక్షణ పొందుతారు.రాజేష్ మీనా ఐ పి ఎస్ రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన వారు, 2022 బ్యాచ్ ఐ పి ఎస్ అధికారి, జోద్ పూర్ ఐ ఐ టి నుండి తెలిపారు
-----------------------
Admin