సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ / అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం దశాబ్దాల నీటి గోసను తీర్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరాయని జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన నీటి దినోత్సవంలో జడ్పీటీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మిషన్ భగీరథ తో సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారన్నారు. మారుమూల పల్లెల్లో మహిళలకు మంచినీటి సమస్య తీరిపోయింన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం పేరుతో అమలు చేస్తుండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా విద్యార్థులతో జల ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో విధుల్లో మంచినీటి ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మంచినీటి విజయంపై గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమణి, వార్డు సభ్యులు దశరదం, జావీద్, మంచె కృష్ణయ్య, దేవుజా నాయక్, పెంటమ్మ , అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin