Wednesday, 29 July 2026 05:30:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజాపాలన దినోత్సవం...

Date : 18 September 2024 02:47 AM Views : 574

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జనరల్ ఆసుపత్రి నందు ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ ఇతర సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ హింసకు తావులేకుండా పనిచేయాలని, మహిళారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేటి యువత ఆల్కహాల్, డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, వారికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రిహాబిలిటేషన్ సెంటర్ లలో మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. జనరల్ ఆసుపత్రి నందు సిబ్బంది కొరత లేదని, అవుట్ సోర్సింగ్ శానిటరీ సక్రమంగా పనిచేసి ఆసుపత్రిని పరిశుభ్రంగా వుంచాలని అన్నారు. వైద్యం కోసం వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని మెరుగైన సేవలు అందించాలని అన్నారు. సిబ్బంది ఆసుపత్రి కి మూలస్ధంభాలని, వారు సక్రమంగా పనిచేస్తేనే ఆసుపత్రి కి మంచి పేరు వస్తుందని అన్నారు. ఆసుపత్రి నిర్వహణ లో రెసిడెంట్ డాక్టర్ లు ముఖ్య పాత్ర పోషించాలని, వారికి గవర్నర్ కు వున్న అధికారాలు వున్నాయని అన్నారు. ప్రతి వార్డులో కూడ అక్కడి సిబ్బంది భాద్యత తీసుకుని పనిచేస్తే ఎటువంటి ఫిర్యాదులు రావని అన్నారు. ఆసుపత్రి కి గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు వస్తారని వారికి మంచి చికిత్స ఇవ్వడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతా పనిచేయాలని, ప్రతి ఒక్కరూ తమ హక్కులతో పాటుగా విధి నిర్వహణ పట్ల కూడ శ్రద్ద వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్దోపెడిక్ హెచ్ వొడి డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రామకృష్ణ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రశాంతి ఆర్ ఎమ్, డాక్టర్ రమేష్ ఆప్టమాలజిస్ట్, డాక్టర్ గురురాజ్ జనరల్ మెడిసిన్, డాక్టర్ యశ్వంత్ డెంటల్ సర్జన్, డాక్టర్ జనార్దన్ ఆర్ ఎమ్ వొ, డాక్టర్ హరికుమార్ ఎవొ, నర్సింగ్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :