Thursday, 30 July 2026 08:33:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ తొందరగా నిర్మించాలని నిరాహార దీక్ష...

Date : 08 June 2023 08:53 AM Views : 343

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ప్రజాసంఘాలు ప్రతిపక్షాలు గత నెల రోజుల వారీగా వివిధ దశల వారి ఆందోళన కార్యక్రమాలు భాగంగా ఈ నెల రెండోవ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా రిలే నిరాహారదీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఉద్దేశించి సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీను మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో షాద్ నగర్ బహిరంగ సభలో ప్రజలకు లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని మాట ఇచ్చినా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా 2019 ఎలక్షన్ అప్పుడు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మిస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈసారి అయిన చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి త్వరలోనే లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి లేని పక్షాన షాద్ నగర్ లో ఉన్న రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నునిర్మించే వరకు వామపక్ష ప్రజా విద్యార్థి సంఘాల ఉద్యమాలు ఆగమని అన్నారు. ఈ జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు సిపిఐ పార్టీ నందిగామ మండల కార్యదర్శి గడ్డం జంగయ్య, కేశంపేట్ మండల కార్యదర్శి గోవింద్ నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎం పవన్ చౌహన్, చంద్రబాబు, లింగం నాయక్, విటల్ యాదవ్, గడ్డం లక్ష్మయ్య, కిషన్ నాయక్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం షాద్ నగర్ అధ్యక్షుడు విజయ చారి, కార్యదర్శి ఆకాష్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :